Andhra Pradesh: అసెంబ్లీ భవనం డిజైన్ 'ఇడ్లీ స్టాండ్'లా ఉందని చంద్రబాబు బోర్లించారు.. దాన్నే నయా తాజ్ మహల్ అంటున్నారు!: విజయసాయిరెడ్డి

  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
  • డిజైన్ ను నయా తాజ్ మహల్ అంటున్నారని వెల్లడి
  • తాజ్ చారిత్రక విశిష్టతను దాటలేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, విజయసాయి రెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు ఎంపిక చేసిన అసెంబ్లీ భవనం డిజైన్ ఇడ్లీలు పెట్టే స్టాండ్ లా కనిపిస్తోందని విమర్శలు వచ్చాయని ఆయన తెలిపారు. అందుకే దాన్ని బోర్లించిన లిల్లీ పువ్వు ఆకారంలోకి మార్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్న నయా తాజ్ మహల్ ఇదేనని సెటైర్ విసిరారు.

ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘అసెంబ్లీ భవనం డిజైన్‌ ఇడ్లీ స్టాండ్‌లా కనిపిస్తోందని విమర్శలు రావడంతో దానిని బోర్లించిన లిల్లీ ఆకృతిలోకి మార్చారంట. నాయుడు బాబు చెబుతున్న నయా తాజ్‌మహల్‌ ఇదేనేమో. తాజ్ ను తలదన్నేలా కట్టినా.. తాజ్‌ చారిత్రక విశిష్టతను ఏదీ అధిగమించలేదన్న ఇంగితం లేదాయె!’ అని విమర్శనాస్త్రాలు సంధించారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Chandrababu
amaravati
design
assembly building
  • Loading...

More Telugu News