Telangana: వైఎస్ అయినా, కేసీఆర్ అయినా .. మా ముందు తలవంచాల్సిందే!: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ

  • గతంలో సీఎంలు మామాట విన్నారు
  • తెలంగాణలో కింగ్ మేకర్ మేమే
  • మరింత జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచన

ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తల వంచాల్సిందేనని ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ వరకూ అందరూ తమ మాటకు గౌరవం ఇచ్చారని తెలిపారు. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేదని మజ్లిస్ పార్టీయేనని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

డిసెంబర్ 11 తర్వాత మజ్లిస్ బలమేంటో ప్రపంచం చూస్తుందని అక్బరుద్దీన్ అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తలవంచాల్సిందేనని అక్బర్ పునరుద్ఘాటించారు. తాను కింగ్ కాదనీ, కింగ్ మేకర్ ననీ చెప్పారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు మరింత సున్నితంగా తయారు అయ్యాయనీ, ఈ సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.  

Telangana
AIMIM
Akbaruddin Owaisi
deciding factor
ys rajasekhar reddy
KCR
  • Loading...

More Telugu News