one night stand: కోరిక తీర్చమంటూ నటికి ప్రపోజల్.. దీటుగా బుద్ధి చెప్పిన నేహా సక్సేనా!

  • యూఏఈలోని అబుదాబీలో ఘటన
  • తనతో గడపాలని నటికి ప్రబుద్ధుడి ఆఫర్
  • ఫేస్ బుక్ లో స్క్రీన్ షాట్లు పెట్టిన నేహా

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం తీవ్ర కలకలం సృష్టించింది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ సహా పలువురి జాతకాలు మారిపోయాయి. వీరంతా పలు కీలక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ ప్రబుద్ధుడు వన్ నైట్ స్టాండ్ కు రావాలంటూ ఓ నటికి ప్రపోజల్ పెట్టాడు. దీంతో ఈ నిర్వాకాన్ని సదరు నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నేహా సక్సేనా అనే నటి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించింది. ఆమె ఓ కార్యక్రమం నిమిత్తం యూఏఈలోని అబుదాబికి వెళ్లింది. అక్కడ ఆమెను గమనించిన ఎల్సన్ దోహీలక్షన్ అనే వ్యక్తి తన కోరిక తీర్చాల్సిందిగా నేహా పీఆర్ మేనేజర్ కు సందేశం పంపాడు. దీంతో ఈ వ్యవహారాన్ని మేనేజర్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వీటి స్క్రీన్ షాట్లు తీసిన నటి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తనకు క్షమాపణ చెబుతూ బహిరంగ లేఖ రాసేవరకూ తాను ఊరుకోబోనని స్పష్టం చేసింది.

తాను సోషల్ మీడియాలో అతడి నిర్వాకాన్ని బయటపెట్టాక, ఫోన్ హ్యాక్ అయిందని ఎల్సన్ కొత్త నాటకాలు ఆడుతున్నాడని నేహా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్సన్ డ్రామాను అతని తల్లిదండ్రులు సైతం నమ్ముతున్నారని వాపోయింది. తను షైన్ సిస్టమ్ లో పనిచేస్తున్నట్లు ఎల్సన్ చెప్పాడనీ, తన అభిమానులు అక్కడకు వెళ్లగా, ఎల్సన్ అక్కడ లేడని స్పష్టం చేశారు.

one night stand
dubai
neha saksena
Facebook
screen shots
Casting Couch
sexual harrasment
  • Error fetching data: Network response was not ok

More Telugu News