BJP: టీవీలో ప్రచారంలో బీజేపీ టాప్.. చిట్టచివరన కాంగ్రెస్!

  • టాప్ బ్రాండ్లన్నీ బీజేపీ తర్వాతే
  • టాప్-10లో కనిపించని కాంగ్రెస్
  • జాబితా విడుదల చేసిన ‘బార్క్’

టీవీ పెట్టామంటే చాలు ప్రకటనల హోరు మొదలవుతుంది. ఒకదానివెంట ఒకటి వచ్చే ప్రకటనలతో ఒక్కోసారి విసుగు కూడా వస్తుంది. అయితే, బీజేపీ దెబ్బకు ఇప్పుడా ప్రకటనలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. టీవీల్లో కనిపించే ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ముందుందని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తెలిపింది.

బీజేపీ ప్రచారంతో ప్రముఖ బ్రాండ్లు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొంది. హిందుస్థాన్ యూనిలివర్, రాకెట్ బెన్కీసర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, విమల్ పాన్ మసాలా, ట్రివాగో, డెటాల్, విప్రో తదితర టాప్ బ్రాండ్ ప్రకటనలన్నింటినీ తోసిరాజనీ బీజేపీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుందని వివరించింది. అన్ని చానళ్లలోనూ బీజేపీయే అతిపెద్ద ప్రకటనదారు అని తెలిపింది. బార్క్ వెల్లడించిన ప్రకటనల జాబితాలో కాంగ్రెస్‌కు టాప్-10లో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.

BJP
TV Adds
Congress
BARC
Elections
  • Loading...

More Telugu News