Actress: పిల్లలకు స్మార్ట్‌ఫోన్ తల్లిలా.. వాట్సాప్ తండ్రిలా మారిపోయాయి: సినీ నటి దివ్యవాణి ఆవేదన

  • క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దివ్యవాణి
  • తల్లిదండ్రుల దృష్టంతా పిల్లలకు ఇచ్చే సంపదపైనే
  • సమయం కూడా ఇవ్వాలన్న నటి

నేటి తరం పిల్లల తీరుపై సినీ నటి దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ప్రపంచం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ చుట్టూ తిరుగుతోందన్నారు. స్మార్ట్‌ఫోన్ వారికి తల్లిలా, వాట్సాప్ తండ్రిలా మారిపోయాయన్నారు. సంపద ఇద్దామన్న ధ్యాసలో పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నామన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘మామ్ అండ్ మీ, డాడ్ అండ్ మీ’ క్యాలెండర్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యవాణి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు-పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచేలా ఉన్న ‘మామ్ అండ్ మీ’ కాన్సెప్ట్ తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఈ క్యాలెండర్‌కు తనతోపాటు తన కుమార్తె కూడా అంబాసిడర్‌గా ఉండడం ఆనందంగా ఉందని, డిసెంబరు 5న క్యాలెండర్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నట్టు దివ్యవాణి తెలిపారు.

Actress
Divya vani
Tollywood
Smartphone
Children
Hyderabad
  • Loading...

More Telugu News