rajanikanth: రజనీకాంత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు...అనారోగ్యం వార్తలన్నీ వదంతులే: సన్నిహిత వర్గాలు

  • సామాజిక మాధ్యమాల్లో సమాచారంపై ఖండన
  • ఆయనను ఆస్పత్రిలో చేర్చారన్న ప్రచారంలో నిజం లేదు
  • ఇటువంటి ఊహాగానాలు నమ్మవద్దని విజ్ఞప్తి

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ను అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేర్చారన్న వార్తలను ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. రజనీకి సుస్తీ చేయడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో షికారు చేయడంతో రజనీ అభిమానుల్లో కలకలం మొదలయింది.

 ముఖ్యంగా రోబోకు సీక్వెల్‌గా భావిస్తున్న, భారీ వ్యయంతో సుదీర్ఘ సమయం నిర్మించిన 2.0 చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులను ఈ వార్తలు మరింత ఆందోళనకు గురిచేశాయి. దీనిపై స్పందించిన రజనీకాంత్‌ సన్నిహిత వర్గాలు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఎటువంటి ఊహాగానాలు, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

rajanikanth
ill health
  • Loading...

More Telugu News