Telangana: బీజేపీకి రాజీనామా.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి పుష్పలీల!

  • ఆరెస్సెస్ చేతిలో బీజేపీ కీలుబొమ్మ
  • బీజేపీ మహిళల్ని చులకనగా చూస్తోందని వ్యాఖ్య
  • తెలంగాణలో విజయం మహాకూటమిదేనని ధీమా

తెలంగాణలో ఎన్నికలు సమీపించిన వేళ బీజేపీకి ఆ పార్టీ నేత ఝులక్ ఇచ్చారు. మహిళలు, దళితులను బీజేపీ చులకనగా చూస్తోందని మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి కె.పుష్పలీల ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చేతిలో బీజేపీ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధించడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News