Andhra Pradesh: ఏపీకి సాటిలేదు.. నైపుణ్యాభివృద్ధిలో నంబర్ వన్

  • నైపుణ్యాభివృద్ధిలో ఏపీ భేష్
  • ప్రభుత్వ కృషి ప్రశంసనీయం
  • ఇండియా ‘స్కిల్స్ రిపోర్టు-2019’లో వెల్లడి

అభివృద్ధి పథాన దూసుకుపోతున్న ఏపీ మరో ఘనత సాధించింది. దేశంలో అత్యధికంగా ఉద్యోగానికి  అర్హమైన నైపుణ్యాలు కలిగి ఉన్న మానవ వనరుల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో గతేడాది టాప్-10లో కూడా లేని తెలంగాణకు ఈసారి 8వ స్థానం దక్కింది. అంతేకాదు, పనికి అనువైన వాతావరణం ఉన్న రాష్ట్రాల విభాగంలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణకు చివరి స్థానం దక్కింది. అలాగే, ఉద్యోగుల నియామకాలకు కంపెనీలు ఇష్టపడే రాష్ట్రాల  కేటగిరీలోనూ ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో ఇండియా ‘స్కిల్స్ రిపోర్ట్-2019’ను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు అగ్రస్థానంలో ఉంది.

ఉద్యోగానికి అర్హమైన నైపుణ్యాలు ఉన్న యువతను అత్యధికంగా సరఫరా చేసే రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి. అయితే, అత్యధిక సంఖ్యలో నియామకాలు జరిగే మొదటి మూడు రాష్ట్రాల్లో మాత్రం ఏపీకి చోటు దక్కలేదు. ఈ విభాగంలో గతేడాది జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి మాత్రం చోటు లభించలేదు. ఇప్పుడా స్థానాన్ని మహారాష్ట్ర ఆక్రమించుకుంది. నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం, ఏపీఎస్‌ఎస్‌డీసీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News