Sonia Gandhi: కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చాం.. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తాం: మేడ్చల్ సభలో సోనియాగాంధీ

  • తెలంగాణ ఏర్పాటు ఎంతో క్లిష్టమైనది... అయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం
  • ఏపీకి నష్టం జరగకూడదని ప్రత్యేక హోదాను ప్రకటించాం
  • ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేస్తున్నా

తన బిడ్డల వద్దకు ఒక తల్లి వచ్చినప్పుడు ఎంత సంతోషపడుతుందో... ఇప్పుడు తెలంగాణకు వచ్చిన తాను కూడా అంతే సంతోషపడుతున్నానని సోనియాగాంధీ చెప్పారు. మేడ్చల్ సభలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో కఠినమైనదని తనకు ఆ రోజుల్లో అనిపించిందని... ఏపీ, తెలంగాణ గురించి ఎంతగానో ఆలోచించానని చెప్పారు.

ఎంతో క్లిష్టమైన సమస్య అయినప్పటికీ... తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను మనసులో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర కలను సార్థకం చేశామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ కు నష్టం జరగుతుందని తెలిసినా తాము తెలంగాణను ఇచ్చామని తెలిపారు. ఏపీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏపీ ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నానని... ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు.

Sonia Gandhi
medchal
congress
Andhra Pradesh
special status
  • Loading...

More Telugu News