Sabarimala: శబరిమలలో శరణుఘోష చెయ్యొద్దనడం సరికాదు: కేరళ హైకోర్టు

  • భక్తుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దు
  • కీర్తనలు పాడటం తీర్థయాత్రలో భాగం
  • సాధారణ భక్తుల జోలికి వెళ్లడం లేదన్న పోలీస్ చీఫ్

శబరిమల ఆందోళనల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు కీర్తనలు పాడొద్దు.. శరణు ఘోష చెయ్యొద్దని.. గుంపులుగా వెళ్లొద్దని పోలీసులు నిబంధనలు విధించారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతోందంటూ కొందరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నేడు తీర్పిచ్చింది.

భక్తులు బృందాలుగా రావడం.. కీర్తనలు పాడటం తీర్థయాత్రలో భాగమని వాటిపై ఆంక్షలు విధించొద్దని.. కఠినంగా వ్యవహరించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 144 సెక్షన్‌ను మాత్రం కొనసాగించాలని.. ఆలయ పరిసరాల్లో శాంతి భద్రతలు కాపాడాలని హైకోర్టు సూచించింది. తాము సాధారణ భక్తుల జోలికి వెళ్లడం లేదని.. గుంపులు గుంపులుగా వెళుతున్న ఆందోళనకారులను మాత్రమే అడ్డుకుంటున్నామని రాష్ట్ర పోలీస్ చీఫ్ కోర్టుకు వెల్లడించారు.

Sabarimala
High Court
Police
Kerala
  • Loading...

More Telugu News