kcr: 4వేలు ఇచ్చాడని అనుకోవద్దు.. ఒక్కొక్క తలపై లక్ష అప్పు తెచ్చాడు: కేసీఆర్ పై ఆర్.కృష్ణయ్య విసుర్లు

  • కేసీఆర్ ఎవరినీ కలవరు.. ప్రగతి భవన్ లో కూర్చొని నిరంకుశంగా పాలిస్తారు
  • ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారు
  • మన పిల్లలు బాగుండాలంటే.. టీఆర్ఎస్ ను ఇంటికి పంపాలి

కేసీఆర్ వి ఓటు బ్యాంకు రాజకీయాలని... ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించాలని కాంగ్రెస్ నేత, బీసీ కులాల సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 4 వేలు ఇచ్చాడని అనుకోవద్దని... రాష్ట్రంలోని ఒక్కొక్క తలపై లక్ష రూపాయలు అప్పు తెచ్చాడని విమర్శించారు. ఈ అప్పును కేసీఆర్ కట్టడని... మనమంతా కలసి కట్టాలని చెప్పారు.

జనాలను, మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను కేసీఆర్ కలవరని, కనీసం సెక్రటేరియట్ కు కూడా వెళ్లరని.... ప్రగతి భవన్ లో కూర్చొని నిరంకుశంగా పాలిస్తారని అన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరం కలసి కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని చెప్పారు. మన పిల్లలు బాగుండాలంటే టీఆర్ఎస్ ను ఇంటికి పంపాలని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,600 పాఠశాలలను మూసివేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.

kcr
TRS
r krishnaiah
congress
  • Loading...

More Telugu News