sonia gandhi: మేడ్చల్ బహిరంగసభకు బయల్దేరిన సోనియాగాంధీ

  • 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకోనున్న రాహుల్
  • బేగంపేట నుంచి మేడ్చల్ బయల్దేరిన సోనియా
  • సభాప్రాంగణానికి భారీగా చేరుకున్న మహాకూటమి మద్దతుదారులు

బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మేడ్చల్ బహిరంగసభకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బయల్దేరారు. మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న రాహుల్ గాంధీతో కలసి మేడ్చల్ వెళ్లాలనుకున్న ఆమె ముందుగానే మేడ్చల్ బయల్దేరారు. రాహుల్ రావడానికి మరో 40 నిమిషాల సమయం పడుతుండటమే దీనికి కారణం.

మరోవైపు, మేడ్చల్ సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో మహాకూటమి మద్దతుదారులు, అభిమానులు చేరుకున్నారు. వేదికపై ప్రజాగాయకుడు గద్దర్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణతో పాటు పలువురు నేతలు ఆసీనులయ్యారు. దాదాపు 120 మంది కూర్చునేలా వేదికను ఏర్పాటు చేశారు. 

sonia gandhi
medchal
congress
  • Loading...

More Telugu News