nani: నాని 'జెర్సీ'విడుదల తేదీ ఖరారు

  • నాని కథానాయకుడిగా 'జెర్సీ'
  • కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ 
  • ఏప్రిల్ 19వ తేదీన విడుదల  

నాని తాజా చిత్రంగా 'జెర్సీ' రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను తన ట్విట్టర్ ద్వారా నాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా కోసం నాని కొంతకాలం పాటు క్రికెట్ ఆటలో శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. ఈ సినిమా తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలుస్తుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.  

  • Loading...

More Telugu News