somireddy: ఓడిపోతే ఫాంహౌస్ లో పడుకుంటానని చెప్పే కేసీఆర్ కూడా ఒక నాయకుడా?: సోమిరెడ్డి

  • ఒక్క సీటును కూడా గెలవలేని బీజేపీ నేతలు టీడీపీని విమర్శిస్తున్నారు
  • మోదీ, అమిత్ షాల స్క్రిప్టులను కేసీఆర్, మురళీధరరావులు చదువుతున్నారు
  • తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది టీడీపీనే

ఒక్క సీటును కూడా సొంతంగా గెలవలేని బీజేపీ నేతలు టీడీపీని విమర్శిస్తుండటం హాస్యాస్పదమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేత మురళీధరరావులు మాట్లాడుతున్నవన్నీ... ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్టులేనని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చింది టీడీపీనే అని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్ లో పడుకుంటానని చెప్పే కేసీఆర్ ఒక నాయకుడా? అని ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, సోమిరెడ్డి ఈ మేరకు విమర్శలు గుప్పించారు. 

somireddy
kcr
muralidharrao
Chandrababu
modi
amith shah
  • Loading...

More Telugu News