jagan: ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా?: జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

  • కేసుల మాఫీ కోసం మోదీ, అమిత్ షాలతో కుమ్మక్కయ్యారు
  • తిత్లీ తుపాను బాధితులను ఇంత వరకు పరామర్శించలేదు
  • రైల్వే జోన్ పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?

బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా? అని మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో జగన్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేంద్రంతో కలసి రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జగన్ కు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.

తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైతే... బాధితులను జగన్ ఇంతవరకు పరామర్శించలేదని లేఖలో కళా వెంకట్రావు ఎండగట్టారు. రాఫెల్ కుంభకోణంపై జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్-2కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కొర్రీలపై ఎందుకు మాట్లాడరని అన్నారు. ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విశాఖ రైల్వే జోన్ పై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

jagan
kala venkatrao
letter
ysrcp
Telugudesam
modi
amith shah
  • Loading...

More Telugu News