vijayawada: విజయవాడలో దారుణం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

  • గగారిన్ అనే ఫైనాన్సియర్ పై దాడి
  • 80 శాతం గాయాలతో కొనఊపిరితో ఉన్న బాధితుడు
  • మాదాల సుధాకర్, మాదాల సురేష్ దాడికి పాల్పడ్డారన్న గగారిన్

విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన గగారిన్ కార్యాలయంలోనే జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 80 శాతం గాయాలపాలైన ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మాదాల సుధాకర్, మాదాల సురేష్ అనే వ్యక్తులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారని పోలీసులకు గగారిన్ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపును మొదలుపెట్టారు. తోటి ఫైనాన్సర్లతో వివాదాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

vijayawada
gagarin
financiar
  • Loading...

More Telugu News