Uttam Kumar Reddy: కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ రిటైర్మెంట్ ప్రకటించాలి
- కేసీఆర్, కేటీఆర్ వేసుకున్న ముసుగు తొలగిపోయింది
- 30 రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం
ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే తనకు ఏమీ కాదని... విశ్రాంతి తీసుకుంటానని... ప్రజలే నష్టపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... కేసీఆర్ ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని, ఇందుకోసం ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నానని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లు వేసుకున్న ముసుగు తొలగిపోయిందని... దోచుకోవడానికే మళ్లీ అధికారంలోకి రావాలని వారు అనుకుంటున్న విషయం ప్రజలకు అర్థమైందని చెప్పారు. 30 రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ. 50వేల గ్రాంట్ ను ఇస్తామని, ఆ తర్వాత ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు.