Bay of Bengal: తమిళనాడు, ఏపీలకు అతి భారీ వర్ష సూచన!

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్గాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సహా 7 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

కాంచీపురం, విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉంటుందని, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. కాగా, భారీ వర్షం హెచ్చరికలతో తమిళనాడులోని 7 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రెస్క్యూ టీమ్ లను సిద్ధం చేశామని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.

Bay of Bengal
Tamilnadu
Andhra Pradesh
South Kostal andhra
Chittoor District
Anantapur District
Nellore District
Rains
Heavy Rains
  • Loading...

More Telugu News