Sivaji: నువ్వు ఏరా అంటే... నేను ఏందే అంటా!: రోజాపై నటుడు శివాజీ వ్యాఖ

  • గతంలో శివాజీని స్టేషన్లో పెట్టి బాదాలన్న రోజా
  • సభ్యతా, సంస్కారం లేకుండా విమర్శిస్తున్నారన్న శివాజీ
  • హద్దులు దాటితే ఊరుకునేది లేదని హెచ్చరిక

నటుడు శివాజీని తీసుకుని వచ్చి పోలీసు స్టేషన్లో పెట్టి నాలుగు బాదితే, ఆపరేషన్ గరుడ వెనకున్న అన్ని నిజాలూ వెలుగులోకి వస్తాయని వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మండిపడ్డారు. రోజా చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ఆమేమైనా పోలీస్ స్టేషన్ పెట్టుకున్నదా? అని ప్రశ్నించారు. మొదలు పెట్టిన తరువాత, సభ్యతా సంస్కారం లేకుండా అంటుంటే, తాను కూడా అలాగే మాట్లాడతానని అన్నారు.

"నువ్వు నన్ను ఒరేయ్ అంటే నేను ఒసేయ్ అంటా. ఏరా అన్నావనుకో నేను ఏందే అంటా" అని అన్నారు. ఎవరి లిమిట్స్ లో వాళ్లు ఉన్నంత వరకూ తాను మర్యాద ఇస్తానని, హద్దులు దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను నేటి వరకూ పోలీసు స్టేషన్ గడప తొక్కలేదని, పోలీసులు తనను ప్రశ్నించలేదని చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తాను చెప్పలేనని శివాజీ వ్యాఖ్యానించారు.

Sivaji
Roja
Operation Garuda
  • Error fetching data: Network response was not ok

More Telugu News