Sivaji: టీడీపీలో ఉన్న ఆ కోవర్టు సుజనా చౌదరేనా?: అన్న ప్రశ్నకు నటుడు శివాజీ సమాధానమిది!

  • గతంలో 'ఆపరేషన్ గరుడ' గురించి చెప్పిన శివాజీ
  • టీడీపీలో కోవర్టు నేత ఉన్నాడని వెల్లడి
  • అతని అప్పులు మాఫీ అయ్యాయని చెప్పిన శివాజీ

ఆంధ్రప్రదేశ్ లో 'ఆపరేషన్ గరుడ'పై మీడియాతో మాట్లాడుతున్న వేళ, అధికార పార్టీలోని ఓ కోవర్టు నేత, ముఖ్యపార్టీలోని మరో నేతను, జాతీయ పార్టీతో కలపడానికి మార్గం సుగమం చేశాడని అప్పట్లో నటుడు శివాజీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు టీవీ చానల్ టీవీ 9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ, యాంకర్ జాఫర్, శివాజీని ఇదే విషయమై ప్రశ్నించాడు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని అడిగితే, వ్యక్తి పేరు తనకు తెలియదన్నాడు. అతను సుజనా చౌదరేనా? అని మళ్లీ ప్రశ్నించగా, చిరునవ్వు నవ్వుతూ, తనకు తెలియదని, అయితే, అతని అప్పుల్లో చాలా భాగం మాఫీ కాబడ్డాయని అన్నారు. అతను టీడీపీలో చాలా ముఖ్య నేతేనని, ఇదే సమయంలో కోవర్టని చెప్పారు. ఆపరేషన్ గరుడ గురించి తనకు తెలిసిన విషయాలను నాడు చెప్పానని తెలిపారు.

Sivaji
TV9
Jafer
Telugudesam
Kovert
Sujana Chowdary
  • Loading...

More Telugu News