The Lion King: చిన్నారులను విశేషంగా ఆకర్షించేలా 'ది లయన్ కింగ్'... తెగ వైరల్ అవుతున్న టీజర్ చూడండి!

  • డిస్నీ నిర్మిస్తున్న 'ది లయన్ కింగ్'
  • హాలీవుడ్ స్టార్స్ తో డబ్బింగ్
  • వచ్చే సంవత్సరం జూలై 19న విడుదల

దాదాపు పాతికేళ్ల క్రితం విడుదలై విజయం సాధించిన 'ద లయన్ కింగ్' యానిమేషన్ ఫిల్మ్ చిత్రం ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో తిరిగి తయారై 3డీ యానిమేషన్లో అదే పేరుతో విడుదలకు సిద్ధం అవుతుండగా, దీని టీజర్ విడుదలై వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ తో డిస్నీ నిర్మిస్తున్న చిత్రానికి 'ది జంగిల్ బుక్' దర్శకుడు జోన్ ఫావ్రే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్లోవర్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫర్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు వివిధ జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవి కానుకగా, జూలై 19న విడుదల కానుంది. చిన్నారులను విశేషంగా ఆకర్షించేలా తయారై వైరల్ అవుతున్న టీజర్ ను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News