KCR: కేసీఆర్‌కు తిట్టినోళ్లంటే మహా ఇష్టం... కాళ్లు మొక్కలేదనే నాకు టికెట్టు ఇవ్వలేదు : బొడిగె శోభ

  • సీఎం కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు
  • ఉద్యమ కారులను అణచివేశారు
  • ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తిట్టినోళ్లంటేనే మహా ఇష్టమని, ఒకప్పుడు కేసీఆర్‌ను ఇష్టానుసారం తిట్టినోళ్లు ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తుండడం ఇందుకు నిదర్శనమని చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ విమర్శించారు. నియోజకవర్గంలో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకోనందునే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో ఉద్యమకారులను తీవ్రంగా అణచి వేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తోందని, ఆయన కుటుంబ సభ్యులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. చొప్పదండి నియోజక వర్గంలో మద్యం, డబ్బు ఏరులై పారుతోందని అన్నారు.

KCR
bodige sobha
choppadandi
  • Loading...

More Telugu News