balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ షూటింగుకి వచ్చేసిన ఎస్వీఆర్

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • ఎస్వీఆర్ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ 
  • జనవరి 9వ తేదీన విడుదల  

తెలుగు సినిమా ఉన్నంతవరకూ గుర్తుండిపోయే నటుడు ఎస్వీ రంగారావు. పౌరాణిక .. జానపద .. సాంఘిక .. చారిత్రక చిత్రాలలో ఎన్టీఆర్ కి దీటుగా నిలిచిన మహానటుడు ఆయన. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు ఘనవిజయాలు సొంతం చేసుకున్నాయి. ఆణిముత్యాలుగా అశేష ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీఆర్ పాత్రకు ప్రాధాన్యత దక్కింది.

ముందుగా ఈ పాత్ర కోసం నాగబాబును అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ పాత్రను చేయడం కుదరలేదు. దాంతో ఎస్వీఆర్ కి దగ్గర పోలికలు కలిగిన ఒక థియేటర్ ఆర్టిస్ట్ ను తీసుకున్నారు. ఈ రోజున ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు. కొన్ని రోజుల క్రితమే 'పాతాళ భైరవి' సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఈ రోజున ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

  • Loading...

More Telugu News