nara rohith: యుద్ధం నేపథ్యంలో సాగే కథ .. హీరోగా నారా రోహిత్

  • నారా రోహిత్ హీరోగా కొత్త చిత్రం 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి 
  • డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్  

నారా రోహిత్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సక్సెస్ అనేది ఆయనకి ఆమడ దూరంలోనే వుండిపోయింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఒక కథను ఎంపిక చేసుకున్నాడు. 1971 నాటి యుద్ధానికి సంబంధించిన కథావస్తువుతో ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేశాడు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బాణం'మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఈసారి కూడా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఇద్దరూ వున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన చేయనున్నారు.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News