Techchie: మొబైల్ ఫోన్ రిపేరుకని వెళ్లి అదృశ్యమైన టెక్కీ భార్య!

  • 4 నెలల క్రితం వివాహం
  • వారం రోజుల నుంచి విభేదాలు
  • పోలీసులను ఆశ్రయించిన యువకుడు

తన సెల్ ఫోన్ ను రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం కావడంతో పోలీసులను ఆశ్రయించాడో టెక్కీ. మరిన్ని వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లా దేవాపూర్ గ్రామానికి చెందిన షేక్ దాదూ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తుండగా, అతనికి 4 నెలల క్రితం అంజు అనే యువతితో వివాహం అయింది.

గడచిన వారం రోజుల నుంచి వారిద్దరి మధ్యా విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలో ఆమె తన ఫోన్ బాగుచేయించుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య అదృశ్యంపై దాదూ ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, అంజు ఆచూకీ లభిస్తే, 91776 54294, 96421 81410 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

Techchie
Missing
Marriage
Wife
Hyderabad
Police
  • Loading...

More Telugu News