Ram Madhav: ఆరోపణలను వెనక్కి తీసుకున్న రాంమాధవ్.. అవి వ్యక్తిగతం కాదని ప్రకటన
- పీడీపీ-నేషనల్ కాన్ఫరెన్స్‌పై సంచలన వ్యాఖ్యలు
- ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
- వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న రాం మాధవ్
పీడీపీ-నేషనల్ కాన్ఫరెన్స్ చేతులు కలపడం వెనక పాకిస్థాన్ ప్రమేయం ఉందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే వారు చేతులు కలిపారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో రాం మాధవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుసకున్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని.. లేకుంటే లెంపలేసుకుని రాం మాధవ్ క్షమాపణలు చెప్పాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన రాం మాధవ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తన ఆరోపణలు రాజకీయమే తప్ప వ్యక్తిగతం కాదన్నారు.