Chandrababu: చంద్రబాబును ఈద్ ముబారక్ చెప్పమంటే.. ఊద్ ముబారక్ అని చెప్పారు: కేసీఆర్ ఎద్దేవా
- తెలంగాణ ఆచారాలు చంద్రబాబుకు తెలియవు
- పట్టీ గురించి ఆంధ్రా వాళ్లకు తెలియదు
- రిజర్వేషన్ల విషయమై కేంద్రం పట్టించుకోవట్లేదు
తెలంగాణ ఆచారాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దగా తెలియవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిర్మల్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. రంజాన్ సమయంలో తనకూ, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. ముస్లింలకు రంజాన్ పవిత్రమైనదని.. కాబట్టి ఈద్ ముబారక్ చెప్పాలని తాను చంద్రబాబుకు చెప్పానన్నారు.
ముస్లిం సోదరుల వద్దకు వెళ్లేసరికి తాను చెప్పింది మరచి ఊద్ ముబారక్ అని చెప్పారని ఎద్దేవా చేశారు. ఇమామ్ జమీన్.. క్షేమంగా పోయి లాభంగా రా అని బంధువులు, పెద్దలు దీవించి కట్టే పట్టీ పవిత్రమైనదని.. అది ఆంధ్రావాళ్లకు తెలియదన్నారు. ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ విషయమై ఎన్ని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవట్లేదని కేసీఆర్ అన్నారు. నిర్మల్‌కు రైలు వస్తుందని, మెడికల్ కళాశాల కూడా రావాల్సి ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి, మత కల్లోలాలు లేవన్నారు.