Chandrababu: చంద్రబాబును రమణ తప్పుదోవ పట్టించారు..టీటీడీపీ నేతల గొంతుకోశారు!: అభిషేక్ గౌడ్

  • పటాన్ చెరును కావాలనే వదిలేశారు
  • రమణ చేతకానితనంతోనే సీట్లు కోల్పోయాం
  • హైదరాబాద్  మీడియా సమావేశంలో విమర్శలు

తెలంగాణలో టీడీపీ నష్టపోవడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రధాన కారణమని అదే పార్టీకి చెందిన నేత అభిషేక్ గౌడ్ ఆరోపించారు. రమణ ఏకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునే తప్పుదోవ పట్టించారని, తెలంగాణ టీడీపీ నేతల గొంతుకోశారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అభిషేక్ అనుచరులతో కలిసి మాట్లాడారు.

పటాన్ చెరు టికెట్ టీడీపీ నేతలకు దక్కకుండా రమణ కుట్రలు చేశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనర్హుడని స్పష్టం చేశారు. ఎల్.రమణ చేతకానితనం కారణంగానే మహాకూటమి పొత్తుల్లో టీడీపీ కీలక స్థానాలను కోల్పోయిందని అభిషేక్ ఆరోపించారు.

Chandrababu
ramana
Telangana
Andhra Pradesh
Telugudesam
Telugudesam
patancheru
mahakutami
angry
abhishek goud
  • Loading...

More Telugu News