purandeswari: నా మేనకోడలు సుహాసినికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది: పురంధేశ్వరి

  • సుహాసినికి నా దేవెనలు ఎప్పుడూ ఉంటాయి
  • మహాకూటమిని, టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి
  • బీజేపీ, మోదీని ఓడించేందుకే మహాకూటమి ఏర్పడింది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి బద్ధ వ్యతిరేకి అయిన సుహాసిని మేనత్త పురంధేశ్వరి ఆమెకు మద్దతు ప్రకటిస్తారా? లేదా? అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పురంధేశ్వరి స్పందించారు. మేనత్తగా సుహాసినికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. పార్టీ పరంగా టీడీపీతో తాను వ్యతిరేకించినా... సుహాసినికి తన దీవెనలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈమేరకు స్పందించారు.

భావసారూప్యత లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ ను ప్రజలు చిత్తుగా ఓడించాలని పురంధేశ్వరి కోరారు. బీజేపీని, మోదీని ఓడించేందుకే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు. తెలంగాణలో రోడ్లు, నీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు. ఇంతకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అవకాశమిచ్చిన మల్కాజ్ గిరి ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. 

purandeswari
nandamuri suhasini
kukatpalli
TRS
bjp
Telugudesam
congress
  • Loading...

More Telugu News