Priyaanka Chiopra: నా పెళ్లి కానుకగా ఏం ఇవ్వాలంటే... అమెజాన్ లో సెలక్ట్ చేసి పెట్టిన ప్రియాంకా చోప్రా!

  • నెలాఖరు నుంచి పెళ్లి సందడి మొదలు
  • జోధ్ పూర్ ను ఎంచుకున్న ప్రియాంక, నిక్
  • వంట, ప్రయాణ సామాన్లు, పడకగది ఉపకరణాలు కావాలట
  • జాబితాను విడుదల చేసిన ప్రియాంక

దీపిక, రణ్ వీర్ ల తరువాత, ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, తన ప్రియుడు నిక్ జొనాస్ ను వివాహమాడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీరి పెళ్లి సంబరాలు ప్రారంభం కాగా, నెలాఖరులో సంగీత్, మెహందీ వేడుకలు, వచ్చే నెల 3న పెళ్లి జరగనుంది. వీరు రాజస్థాన్ లోని అందాల నగరం జోధ్ పూర్ లో వివాహం చేసుకోనున్నారు. ఇక తన పెళ్లికి వచ్చే అతిథులు ఏమైనా కానుకలు ఇవ్వాలంటే, తాను చెప్పినవే తేవాలంటూ ప్రియాంక చాంతాడంత లిస్టును విడుదల చేసింది.

 ఈ మేరకు ఆన్ లైన్ షాపింగ్ సంస్థ 'అమెజన్'లో కొన్ని వస్తువులను సెలక్ట్ చేసి, వాటి జాబితాను బయటకు విడుదల చేసింది. తన వంటగదికి అవసరమైన చెంచాలు, ఫోర్క్ లు, డిన్నర్ ప్లేట్ లు వైన్ గ్లాస్ లు, ట్రావెలింగ్ కు ఉపయోగపడే సామాన్లు, బ్యాగులు, మేట్రస్, దిండ్లు, టూత్ బ్రష్ లు, వ్యాయామానికి ఉపయోగపడే సామాన్లు, ఎల్ఈడీ టీవీ వంటివి ఉన్నాయి. తాను పెంచుకునే కుక్క డయానా కోసం కూడా బహుమతులు తేవచ్చని చెప్పిందీ బాలీవుడ్ అందాల భామ.

Priyaanka Chiopra
Nick Jonas
Marriage
Amazon
  • Loading...

More Telugu News