Rajamouli: 'RRR' మ్యాజిక్... ఫైట్ కోసం 120 కెమెరాలు వాడుతున్న రాజమౌళి!
- సన్నివేశాలకు 4డీ సాంకేతికత
- పవర్ ఫుల్ ఎఫెక్ట్స్ చూపనున్న రాజమౌళి
- వేగంగా సాగుతున్న షూటింగ్
దర్శక దిగ్గజం రాజమౌళి తలపెట్టిన మల్టీస్టారర్ కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా, పోరాట దృశ్యాలను చిత్రీకరించేందుకు 4డీ టెక్నాలజీని జోడించినట్టు తెలుస్తోంది. ఇద్దరు హీరోల ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని, ఫైట్ సీన్స్ తీసేందుకు ఏకంగా 120 కెమెరాలను జక్కనా తెప్పించారట.
ఈ కెమెరాల్లోని టెక్నాలజీతో వచ్చే ఎఫెక్ట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. సీన్స్ లో నటీనటుల హావభావాలు, ముఖ కవళికలను మరింత చక్కగా ఇవి క్యాప్చర్ చేస్తాయట. కాగా, ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ను వేశారన్న సంగతి తెలిసిందే. సినిమా కథలో భాగంగా కొంత భాగం అడవుల్లో తీయాల్సి వుండటంతో, 'బాహుబలి'లో వాడిన 'కిలికి'లా, ఆటవికుల భాషగా కొత్త భాషను కనిపెట్టే పనిలో ఉన్నారట రాజమౌళి.