Bollywood: బాలీవుడ్ నటి సోఫీ కారును ఢీకొట్టిన ఆటో.. త్రుటిలో తప్పించుకున్న నటి!

  • మహారాష్ట్రలోని ముంబైలో ఘటన
  • నిన్న అర్థరాత్రి వేగంగా ఢీకొన్న ఆటో
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

బాలీవుడ్ నటి సోఫీ చౌదరికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె వెళుతున్న బీఎండబ్ల్యూ కారును నిన్న రాత్రి ఓ ఆటో అతివేగంగా ఢీకొంది. ఈ ఘటనలో సోఫీ సురక్షితంగా బయటపడగా, కారు స్వల్పంగా దెబ్బతింది. కాగా, ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో సీసీటీవీలను పరిశీలించిన ఖర్ పోలీసులు.. నిందితుడిని అనీశ్ అహ్మద్(22)గా గుర్తించారు. ఈ రోజు ఉదయం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో అనీశ్ ను కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News