Uttam Kumar Reddy: తెల్లవారు జామున ఉత్తమ్‌, కోదండరామ్‌ భేటీ...స్నేహపూర్వక పోటీపై గందర గోళానికి తెరపెట్టే ప్రయత్నం

  • ఇతర పక్షాలకు కేటాయించిన సీట్లలో బి ఫారాలు ఇవ్వడంపై టీజేఎస్‌ అధినేత అసంతృప్తి
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో అసహనం
  • పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన టీపీసీపీ అధ్యక్షుడు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ గురువారం తెల్లవారు జామున భేటీ అయ్యారు. మహా కూటమి సీట్ల సర్దుబాటు అంశంలో నెలకొన్న పలు అనుమానాలు, అసంతృప్తులపై చర్చించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం, ఉపసంహరణకు నేటి సాయంత్రంతో గడువు ముగియనుండడంతో కూటమిలో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని నిర్ణయించారు. కూటమికి కేటాయించిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ తన అభ్యర్థులకు బీఫామ్ లు అందించడంపై కోదండరామ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై బుధవారం రాత్రి కోదండరామ్‌ పలువురు కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయినా పరిస్థితి ఓ కొలిక్కిరాలేదు. దీంతో ఉత్తమ్‌ తెల్లవారు జామున కోదండరామ్‌ ఇంటికి వెళ్లి చర్చించినట్లు సమాచారం. కొన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు ఎందుకు బి ఫామ్‌లు ఇచ్చిందీ వివరించినట్లు సమాచారం. అంతా సావధానంగా విన్న కోదండరామ్‌ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత తన అభిప్రాయం చెబుతానని వెల్లడించినట్లు తెలిసింది. ఈ అంశంపై గురువారం జరిగే టీజేఎస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News