MRPS: ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికో నేడు ప్రకటించనున్న ఎమ్మార్పీఎస్!

  • మాదిగల డిమాండ్లపై అన్ని పార్టీలు స్పందించాలి
  • దళితుల అభివృద్ధికి పాటుపడే పార్టీలకే మద్దతు
  • తేల్చి చెప్పిన మేడిపాపయ్య, వంగపల్లి

ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో తాము ఏ పార్టీకి మద్దతు ఇచ్చేదీ నేడు ప్రకటించనున్నట్టు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, పెన్షన్, దళిత అభివృద్ధి ఎజెండాగా పనిచేసే పార్టీలకే తాము మద్దతు ఇవ్వనున్నట్టు తేల్చి చెప్పారు. మాదిగల న్యాయమైన డిమాండ్ల విషయంలో పార్టీలన్నీ తమ వైఖరి ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హోంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

MRPS
Telangana
Elections
Medi papaiah
vangapalli Srinivas
  • Loading...

More Telugu News