Sonia Gandhi: 23న సోనియా గాంధీ రాకతో, సినారియో మొత్తం మారిపోనుంది: బండ్ల గణేశ్

  • తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా
  • ఆమె రాకతో వార్ వన్ సైడ్ కానుంది
  • సోనియా సభలో నాకు మాట్లాడే అవకాశమొస్తే అదృష్టమే!

ఈ నెల 23న మేడ్చల్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో సోనియాగాంధీ ముందు ప్రసంగించే అవకాశం తనకు వస్తే అదృష్టంగా భావిస్తానని టీ-కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి, గొప్ప నాయకురాలు సోనియా రాకతో, సినారియో మొత్తం మారిపోనుందని.. వార్ వన్ సైడ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వమని సోనియా కోరితే, ప్రజలు తమకు ఓట్లేసి గెలిపిస్తారని అన్నారు. కేవలం కేసీఆరో, కేటీఆరో పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఎందరో అమరవీరుల త్యాగఫలమిదని, ఈ పోరాటంలో పదహారు వందల మంది అసువులు బాశారని, కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? అంటూ ప్రశ్నించారు.

Sonia Gandhi
t-congress
bandla ganesh
medchal
  • Loading...

More Telugu News