t-congress: డిసెంబర్ 7, 11 తేదీలెప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నా: బండ్ల గణేశ్

  • ‘కారు’ తప్పకుండా తిరగ బడుతుంది
  • మేము అధికారంలోకి రావడం ఖాయం
  • టీఆర్ఎస్ లో విశ్వేశ్వర్ రెడ్డి విసిగిపోయారు

టీ-కాంగ్రెస్ తరపున రాజేంద్ర నగర్ నియోజకవర్గం టికెట్ దక్కలేదన్న అసంతృప్తి తనకు లేదని, డిసెంబర్ 7, 11 తేదీలెప్పుడొస్తాయా అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని ఆ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ‘కారు’ తిరగబడటం ఖాయమని, తాము అధికారంలోకి తప్పకుండా వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్టుందని విమర్శించారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం, నేడు అప్పుల పాలైపోయిందని విమర్శించారు.

త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంశం గురించి ప్రస్తావించగా, ఆయన స్పందిస్తూ.. విశ్వేశ్వర్ రెడ్డి మచ్చలేని నాయకుడని, ఆ పార్టీలో విసిగిపోవడం వల్లే తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి మరికొంత మంది నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

t-congress
bandla ganesh
december 7
december 11
  • Loading...

More Telugu News