srisailam: రేపు శ్రీశైలం ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

  • కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశాం
  • రేపు రాత్రి శిఖర దివ్య జ్యోతిని అధికారులు వెలిగిస్తారు
  • రేపు అలంకార దర్శనంలో మల్లికార్జునస్వామి: ఈవో

శ్రీశైల పుణ్యక్షేత్రంలో రేపు అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయని ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశామని అన్నారు. మల్లికార్జునస్వామి రేపు అలంకార దర్శనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, రేపు రాత్రి శిఖరేశ్వరం వద్ద శిఖర దివ్య జ్యోతిని అధికారులు వెలిగించనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి నంద్యాలకు చెందిన ఓబయ్య అనే భక్తుడు లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. 

srisailam
aarjita seva
full moon
mallikarjuna swamy
  • Loading...

More Telugu News