Rahul Gandhi: కన్ను కొట్టే నాయకుడు రాహుల్.. కంటికి రెప్పలా చూసుకునే నాయకుడు కేసీఆర్: హరీశ్

  • కాంగ్రెస్‌ను నమ్మొద్దు
  • కోదండరాంను మోసం చేసింది
  • ఏడాది లోపల కాళేశ్వరం పూర్తి అవుతుంది

కన్ను కొట్టే నాయకుడు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా మానుకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నంలో పర్యటించారు. ప్రజా కూటమితో పొత్తుపెట్టుకుని కూడా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ను నమ్మొద్దన్నారు.

కన్ను కొట్టే నాయకుడు రాహుల్ అని.. రాష్ట్రాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న నాయకుడు కేసీఆర్ అని హరీశ్ వ్యాఖ్యానించారు. కోదండరాంను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఉద్యమ సమయంలో తప్పించుకుని తిరిగిందన్నారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హుజురాబాద్‌, సిద్దిపేటలా మానుకొండూర్‌ను కూడా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఏడాది లోపల కాళేశ్వరం పూర్తి అవుతుందని.. మిడ్‌మానేర్‌, కాళేశ్వరం కలిపితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సస్యశ్యామలవుతుందని హరీశ్ వెల్లడించారు.

Rahul Gandhi
Harish Rao
KCR
Karimnagar District
Kodandaram
Chandrababu
  • Loading...

More Telugu News