chandrababu: చంద్రబాబు గొప్పవారే.. కానీ, ఆయనతో ప్రయాణం ప్రమాదకరం: పవన్ కల్యాణ్

  • చంద్రబాబు ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో.. ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పలేం
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీకి మద్దతిచ్చా
  • మహాకూటమి కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవు

తన చెన్నై పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అని చెబుతూనే... ఆయనపై సెటైర్లు వేశారు. ఆయన ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని అన్నారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండానే ఆ పార్టీకి మద్దతు ప్రకటించానని... కానీ, ఏమీ జరగలేదని విమర్శించారు. మహాకూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. 

chandrababu
pawan kalyan
chennai
janasena
Telugudesam
mahakutami
  • Loading...

More Telugu News