tammareddy bhardwaja: పైరసీ చేసినవారికి గుణపాఠమే 'టాక్సీవాలా' సక్సెస్: తమ్మారెడ్డి భరద్వాజ

  • 'టాక్సీవాలా'ను పైరసీ చేసి సంబరపడ్డారు 
  • సినిమాలో దమ్ముంటే ఎవరూ ఆపలేరు
  • కంటెంట్ లేకపోతే పైరసీలో కూడా చూడరు           

ఈ నెల 17వ తేదీన వచ్చిన 'టాక్సీవాలా' .. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకి ముందే పైరసీకి గురికావడం గురించి, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. "విడుదలకి ముందే కొంతమంది ఈ సినిమాను పైరసీ చేసి లీక్ చేశారు. ఈ సినిమాను చంపేశామని వాళ్లు సంబరపడిపోయి వుంటారు. గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను విడుదల చేయడం లేదనీ .. ప్రింట్ ను తగలబెట్టే ఆలోచనలో వున్నారని మరికొంతమంది ప్రచారం చేశారు. అలాంటి వాళ్లందరికీ ఈ సినిమా సక్సెస్ సమాధానం చెప్పింది. పైరసీ సినిమాలను జనం చూడరనుకునేవారికి గుణపాఠం చెప్పింది. సినిమాలో దమ్ముంటే థియేటర్స్ కి వచ్చే వాళ్లను పైరసీ ఆపలేదు. సినిమాలో విషయం లేకపోతే పైరసీలో చూడటానికి కూడా జనం ఇష్టపడరు. అదే విషయాన్ని 'టాక్సీవాలా' మరోమారు నిరూపించింది" అని ఆయన చెప్పుకొచ్చారు.         

tammareddy bhardwaja
  • Loading...

More Telugu News