Rahul Gandhi: రాహుల్ తో మంచి సమావేశం జరిగింది.. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పని చేస్తోంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • మహేందర్ రెడ్డితో వివాదం కారణంగా టీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు
  • కాంగ్రెస్ లో చేరిన తర్వాత స్పీకర్ కు రాజీనామా అందిస్తా
  • నా నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంత్రి మహేందర్ రెడ్డితో వివాదం కారణంగా తాను పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలుకాలేదని విమర్శించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పని చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీతో తన నియోజకవర్గ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత లోక్ సభ స్పీకర్ కు తన రాజీనామాను అందిస్తానని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే టీఆర్ఎస్ ను వీడానని చెప్పారు.

Rahul Gandhi
konda visweshwar reddy
TRS
congress
  • Loading...

More Telugu News