Mahakutami: అధికారుల అతిపెద్ద తప్పు... నందమూరి సుహాసిని భర్తపేరు నందమూరి హరికృష్ణట!

  • మహాకూటమి తరఫున కూకట్ పల్లి నుంచి బరిలోకి
  • భర్త పేరు ఉండాల్సిన చోట హరికృష్ణ పేరు
  • చిన్న తప్పులతో నామినేషన్ రిజక్ట్ చేయలేమన్న రిటర్నింగ్ అధికారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగిన నందమూరి వెంకట సుహాసిని ఓటరు ఐడీ కార్డులో అధికారులు అతిపెద్ద తప్పు చేశారు. ఆమె ఇటీవలే నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోగా, ఓటరు కార్డులో భర్త పేరు ఉండాల్సిన చోట సుహాసిని తండ్రి నందమూరి హరికృష్ణ పేరును ప్రింట్ చేశారు.

 ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్ అన్న సంగతి తెలిసిందే. వివాహితురాలైన సుహాసిని, తన ఓటరు కార్డులో భర్త ఇంటి పేరుకు బదులుగా పుట్టింటి పేరైన నందమూరినే ఉంచుకున్నారు. కాగా, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఎన్నికల జాబితాలో పార్ట్ నంబర్ 48లో సీరియల్ నెంబర్ 710గా ఆమె పేరు రిజిస్టర్ అయివుంది. ఓటరు కార్డులో ఇటువంటి తప్పులు సహజమని, దాన్ని సాకుగా చూపి నామినేషన్ ను తిరస్కరించలేమని రిటర్నింగ్ అధికారి మమత వెల్లడించడం గమనార్హం.

Mahakutami
Nampalli
Nandamuri
Suhasini
Harikrishna
  • Loading...

More Telugu News