Jagan: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్... జగన్ ను సెల్ఫీ అడిగిన వేళ..!

  • 300 రోజులు దాటిన జగన్ పాదయాత్ర
  • మార్గమధ్యంలో సెల్ఫీ అడిగిన డ్రైవర్ తో ఫోటో దిగిన జగన్
  • ఇప్పటివరకూ 3,280 కి.మీ నడిచిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 300 రోజుల క్రితం ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర, ప్రస్తుతం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాగుతున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జగన్ పాదయాత్ర మార్గంలో వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్, జగన్ ను చూసిన ఆనందంలో సెల్ఫీ దిగాలని ఉందని కోరాడు. అతని కోరికను తీర్చాలని నిర్ణయించుకున్న జగన్, డ్రైవర్ సెల్ ఫోన్ ను అడిగి తీసుకుని అతనితో సెల్ఫీ దిగాడు. దీంతో ఆ డ్రైవర్ ముఖం ఆనందంతో వెలిగిపోగా, ఈ దృశ్యాన్ని పాదయాత్రను చిత్రీకరిస్తున్న కెమెరాలు బంధించాయి.

కాగా, నిన్నటివరకూ జగన్ మొత్తం 3,280 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేయగా, నేడు 303వ రోజు యాత్ర మొదలైంది. మరో నాలుగు రోజుల్లో జగన్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది.

Jagan
APSRTC
Driver
Selfy
Padayatra
Vijayanagaram District
  • Loading...

More Telugu News