konda visweshwar reddy: రాహుల్ గాంధీతో భేటీ అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • కుంతియాతో కలసి రాహుల్ నివాసానికి వెళ్లిన కొండా
  • టీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి గల కారణాల వివరణ
  • 23న మేడ్చల్ సభలో కాంగ్రెస్ లో చేరిక 

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతో కలసి ఆయన రాహుల్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తాను టీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన ఈ సందర్భంగా రాహుల్ కు వివరించారు.

 ఈ నెల 23న హైదరాబాద్ మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ ల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. నిన్ననే విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు, ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, ఐదు కారణాలను ప్రస్తావిస్తూ... నిన్న సాయంత్రం మూడు పేజీల లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు ఆయన రాశారు.

konda visweshwar reddy
TRS
congress
Rahul Gandhi
  • Loading...

More Telugu News