Tamilnadu: తమిళనాడులో ‘గజ’ విలయం.. భారీ విరాళం ప్రకటించిన రజనీకాంత్!

  • భారీ నష్టం చేకూర్చిన గజ తుపాను
  • ఉదారంగా స్పందిస్తున్న తమిళ సినీపరిశ్రమ
  • బాధితుల్ని ఆదుకునేందుకు సూపర్ స్టార్ చొరవ

ప్రమాదకర తుపాను ‘గజ’ దెబ్బకు తమిళనాడు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖ నటులు, సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నటుడు సూర్య కుటుంబంతో పాటు హీరో విజయ్ సేతుపతి సహా పలువురు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. కాగా, తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ గజ బాధితులకు రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తామని తెలిపారు.

ఈ మొత్తాన్ని వస్తువులు, ఇతర నిత్యావసరాల రూపంలో బాధితులకు అందజేస్తామని పేర్కొన్నారు. మరోవైపు యువ నటుడు శివకార్తికేయన్ గజ బాధితులకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. వీటిలో రూ.10 లక్షలను సీఎం సహాయ నిధికి అందిస్తామనీ, మిగిలిన మొత్తాన్ని సహాయక వస్తువులు, సామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తామని వెల్లడించారు. మరోవైపు రోబో 2.ఓ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ గజ బాధితులకు రూ.1.01 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

Tamilnadu
gaja storrm
kollywood
Rajinikanth
donation
victims of gaja storm
support
  • Loading...

More Telugu News