mohan lal: మోహన్ లాల్ లుక్స్ అద్భుతం .. 'ఒడియన్' విడుదల తేదీ ఖరారు

- మోహన్ లాల్ హీరోగా 'ఒడియన్'
- ఆశ్చర్యపరిచే గ్రాఫిక్స్ .. స్టంట్స్
- డిసెంబర్ 14వ తేదీన విడుదల
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో మోహన్ లాల్ ఎప్పుడూ ముందేవుంటారు. ఈ కారణంగానే ఆయన ఖాతాలో అనేక ప్రయోగాలు .. అవి సాధించిన విజయాలు కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా 'ఒడియన్' నిర్మితమైంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.
