Uttam Kumar Reddy: నెట్టింట ఉత్తమ్ కన్నా రేవంత్ గురించే అధిక వెతుకులాట!

  • రేవంత్ సమాచారం కోసం అత్యధిక శోధన
  • కేసీఆర్ సభలు, ఉపన్యాసాలపై కూడా
  • వెల్లడించిన గూగుల్ ట్రెండ్స్

గూగుల్ సెర్చింజన్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా రేవంత్ రెడ్డి గురించే నెటిజన్లు అత్యధికంగా వెతుకుతున్నారు. గూగుల్ తాజా సెర్చ్ ట్రెండింగ్స్ లో 2018లో ఎవరు గెలుస్తారు? అన్న విషయంపైనా వెతుకులాట సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలతో పాటు కేసీఆర్ సభలు, ఆయన లైవ్ ఉపన్యాసాల గురించి కూడా నెటిజన్లు సోధిస్తున్నారు.

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన వేళ, టీఆర్ఎస్ గురించి ఎక్కువగా శోధించిన నెటిజన్లు, ఆపై నవంబర్ 1 తరువాత కాంగ్రెస్ వైపు మారినట్టు గూగుల్ ట్రెండ్స్ తెలుపుతున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైన తరువాత, ఆ పార్టీ గురించి, అభ్యర్థుల వివరాల గురించి శోధన గణనీయంగా పెరిగింది. కేటీఆర్ ఫోన్ నంబర్ కోసం, రేవంత్ ఫోన్ నంబర్, అతని నియోజకవర్గం, కుటుంబీకుల ఫోటోల గురించి కూడా నెటిజన్లు తెగ వెతికేస్తున్నారట.

Uttam Kumar Reddy
Revanth Reddy
KCR
KTR
Google
  • Loading...

More Telugu News