Andhra Pradesh: మా మద్దతు టీఆర్ఎస్ కే.. కీలక ప్రకటన చేసిన ఏపీ సెటిలర్స్ ఫోరం!

  • కేసీఆర్ చక్కటి పాలన అందిస్తున్నారు
  • హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉంటున్నాం
  • మహాకూటమికి ఓటు వేయబోం

తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణలోని ఏపీ సెటిలర్స్ ఫోరం(టీఎస్ఎఫ్) నేతలు ప్రకటించారు. ఈ విషయమై టీఎస్ఎఫ్ చైర్మన్ రమేశ్ మాట్లాడుతూ..ఆంధ్రా ప్రాంత ప్రజలు హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలతో కలిసిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వం తమను కడుపున పెట్టుకుని చూసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు.

మహాకూటమి తెలంగాణలో విభజన రాజకీయాలకు సిద్ధమవుతోందని విమర్శించారు. అలాంటి కూటమికి ఆంధ్రా, రాయలసీమ సెటిలర్లు ఓటువేయబోరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం చైర్మన్‌ నండూరి ఎస్‌.ఎస్‌.రమేష్‌, ఉపాధ్యక్షుడు వి.భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎన్‌.చౌదరి, సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ తివారీ పాల్గొన్నారు.

Andhra Pradesh
Telangana
KCR
settlers
andhra
support TRS
  • Loading...

More Telugu News