Narendra Modi: ప్రధాని మోదీతో భారత్‌ క్రికెట్‌జట్టు సభ్యుడు రవీంద్ర జడేజా దంపతుల భేటీ

  • ఆల్‌రౌండర్‌తో కలిసి దిగిన ఫొటోను స్వయంగా ట్వీట్‌ చేసిన ప్రధాని
  • జడేజా దంపతులతో కలిసి ముచ్చటించడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్య
  • ఈ కలియక వెనుక కారణాలు మాత్రం వెల్లడి కాలేదు

భారత్‌ క్రికెట్‌ జట్టు సభ్యుడు, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ప్రధాని నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. భార్య రివాబాతో కలిసి ప్రధాని కార్యాలయానికి వెళ్లిన ఈ లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌, మోదీకి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపిన అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను స్వయంగా మోదీయే పోస్టు చేస్తూ ‘జడేజా దంపతులతో కలిసి ముచ్చటించడం ఎంతో గొప్పగా ఉంది’ అని ట్వీట్‌ చేయడం గమనార్హం. గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన జడేజా ప్రధానిని ఎందుకు కలిశారన్న విషయం మాత్రం తెలియరాలేదు.

Narendra Modi
cricketer ravindra jadeja
meet at delhi
  • Loading...

More Telugu News