Andhra Pradesh: కడప జిల్లాలో టెన్షన్, టెన్షన్.. అవినాశ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్!

  • వైసీపీలో నేడు చేరనున్న టీడీపీ నేతలు
  • జమ్మలమడుగులో కార్యక్రమం ఏర్పాటు
  • వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మలమడుగు మండలంలోని గొరిగేనూర్ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఈరోజు వైసీపీలోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం వైసీపీ మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్ రెడ్డిలను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైసీపీ నేతలు అక్కడికి వెళితే ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యమున్న గ్రామం కావడంతోనే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాము శాంతియుతంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా అధికారులు హౌస్ అరెస్ట్ చేశారని వాపోయారు.

Andhra Pradesh
kadapa
YSRCP
leaders house arrest
Police
Telugudesam
adi narayana reddy
  • Loading...

More Telugu News